కార్ కొనుగోలు పేరుతో పిలిచి.. పిస్టల్, కత్తితో బెదిరించి దోపిడీ

కార్ కొనుగోలు పేరుతో పిలిచి.. పిస్టల్, కత్తితో బెదిరించి దోపిడీ మెర్సిడెస్ బెంజ్ కారు, ఐఫోన్, ఖరీదైన వాచ్‌లు అపహరణ.. ఐదుగురు నిందితుల అరెస్ట్ కీసర, సెప్టెంబర్ 13: కారును కొనుగోలు చేస్తామని నమ్మించి బాధితులను నిర్మానుష్య ప్రాంతంలోని ఫార్మ్‌హౌస్‌కు రప్పించి, పిస్టల్, కత్తితో బెదిరించి దోపిడీకి పాల్పడిన ఐదుగురు నిందితులను కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఎయిర్ పిస్టల్, కత్తి, ఐఫోన్, Tissot, Casio వాచ్‌లు, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైం నెం.923/2026...