*1,25,325 రూపాయలకు లడ్డును కైవసం చేసుకున్న అన్నం ఆంజనేయులు….*
ప్రజావాణి
దుబ్బాక నియోజకవర్గం
చేగుంట మండల కేంద్రంలో ఎన్.జి.ఓ.ఎస్ కాలనీలో వినాయకుని నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వినాయకుని నిమర్జనం శోభయాత్ర ఘనంగా జరిగింది.వినాయకుని లడ్డు వేలంలో పాల్గొని లడ్డుని కైవాసం చేసుకున్న చేగుంట అన్నం ఆంజనేయులు 1,25,325 రూపాయలకు వినాయకుని లడ్డును దక్కించుకున్నారు.వేలంలో వచ్చిన నగదును ఆలయ అభివృద్ధికి గణేష్ ఉత్సవ కమిటీ కార్యక్రమాలకు వినియోగిస్తామని నిర్వాహకులు తెలిపారు.