prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 8:33 pm Digital Edition : PRAJA VANI

111 జి ఓ లో అక్రమ నియమాలకు తావులేదు – ఎంపీఓ నాసరయ్య

111 జి ఓ లో అక్రమ నియమాలకు తావులేదు
– ఎంపీఓ నాసరయ్య

రంగారెడ్డి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 22 ప్రజావాణి

మద్దూరు గ్రామపంచాయతీ పరిధిలోని 111జి ఓ అమలులో ఉన్న ప్రాంతంలో చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తొలగించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎంపిఓ మాట్లాడుతూ… గ్రామపంచాయతీ అనుమతి లేకుండా చేపట్టే అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి, మద్దూర్ పంచాయతీ కార్యదర్శి, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.