108, 102 అంబులెన్స్‌ల ఆకస్మిక తనిఖీ

108, 102 అంబులెన్స్‌ల ఆకస్మిక తనిఖీ అత్యవసర సేవల్లో వేగం, నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి: అధికారులు భూపాలపల్లి, సెప్టెంబర్ 29 మన ప్రజావాణి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రజలకు అందుతున్న 108, 102 అంబులెన్స్ సేవలను అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మేనేజర్ శివకుమార్, జిల్లా మేనేజర్ రాజు, స్పెషల్ ఆడిటర్ కిషోర్ ఆధ్వర్యంలో అంబులెన్స్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా అంబులెన్స్‌లలో అత్యవసర మందులు, వైద్య పరికరాలు, ఇతర ప్రథమ చికిత్స సామగ్రి అందుబాటులో ఉన్నాయా లేదా పరిశీలించారు....