prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 8:18 am Digital Edition : NAVEEN NADIKUDA

1000 ల కాంగ్రెస్ దగా పాలనపై బీఆర్‌ఎస్ నిరసన

1000 ల కాంగ్రెస్ దగా పాలనపై బీఆర్‌ఎస్ నిరసన

 

పరకాల అంబేద్కర్ సెంటర్‌లో వంటావార్పు

 

రోడ్డుపైనే మహిళలతో భోజనం చేసిన చల్లా ధర్మారెడ్డి

 

హామీల అమలులో ప్రభుత్వం విఫలం

 

మహిళలు, వృద్ధులు, విద్యార్థులకు దగా

 

మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి…..

 

ప్రజావాణి హన్మకొండ బ్యూరో నవీన్

ప్రజావాణి, సెప్టెంబర్ 4 పరకాల: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. 1000 రోజుల కాంగ్రెస్ దగా పాలనకు నిరసనగా బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పరకాల అంబేద్కర్ సెంటర్‌లో నిర్వహించిన వంటావార్పు కార్యక్రమానికి మహిళలు, వృద్ధులు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రోడ్డుపైనే పొయ్యిలు వెలిగించి వంటలు చేసి మహిళలతో కలిసి మాజీ ఎమ్మెల్యే భోజనం చేస్తూ నిరసన తెలిపారు.

 

ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కొక్కటిగా ప్రజలకు దూరం చేస్తున్నారని మండిపడ్డారు. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల కింద ఇస్తామన్న తులం బంగారం ఎక్కడుందని ప్రశ్నించారు. పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలకు అండగా నిలిచిన ఈ పథకాలను నిర్వీర్యం చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు.

 

మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పటికీ ఆ హామీని అమలు చేయలేదన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామని గొప్పలు చెప్పుకుంటూ, మరోవైపు పురుషులపై చార్జీల భారం పెంచి కుటుంబాల్లోనే పంచాయతీలు పెట్టే పరిస్థితి తీసుకొచ్చారని చల్లా ధర్మారెడ్డి విమర్శించారు.

 

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని చల్లా ధర్మారెడ్డి డిమాండ్ చేశారు. మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, పేదల సంక్షేమాన్ని విస్మరిస్తే ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తుచేస్తూ ప్రజల పక్షాన బీఆర్‌ఎస్ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని చల్లా ధర్మారెడ్డి స్పష్టం చేశారు.

 

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.