పోరుమామిళ్లలో ఫుట్‌పాత్‌ల ఆక్రమణలతో తీవ్ర ట్రాఫిక్ జంజాటం: స్కూల్ విద్యార్థులు, ప్రజల అవస్థలు — పట్టించుకోని పంచాయతీ, పోలీస్ అధికారులు

కడప జిల్లా పోరుమామిళ్ల సెప్టెంబర్ 10 ప్రజావాణి  మండల కేంద్రంలో రోజురోజుకూ ట్రాఫిక్ సమస్య నరకాన్ని చూపుతోంది. ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న ఫుట్‌పాత్‌లు పూర్తిగా ఆక్రమణలకు గురికావడంతో స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ అధికారులు, స్థానిక పోలీసులు ఈ సమస్యను పట్టించుకోకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రమాదం పొంచి ఉందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపార సముదాయాలుగా మారిన ఫుట్‌పాత్‌లు: పాదచారులు నడవడానికి ఉద్దేశించిన ఫుట్‌పాత్‌లపై కొందరు వ్యాపారులు పెద్ద పెద్ద రేకుల షెడ్లను...