తెలంగాణ తొలి వీరనారి.. చాకలి ఐలమ్మకు నేడు 40వ వర్ధంతి

భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన ఐలమ్మ నైజాం గడీల గుండెల్లో నిద్రపోయిన ధైర్యం - చాకలి ఐలమ్మ తెలంగాణ పోరాటానికి స్ఫూర్తి ప్రదాత ములుగు గొల్లపెల్లి శ్రీకాంత్ (ప్రజావాణి) తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరవనిత చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి నేడు. 1985 సెప్టెంబర్ 10న ఆమె మరణించారు. 1919లో వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం క్రిష్ణాపురంలో నిరుపేద రజక కుటుంబంలో జన్మించిన ఐలమ్మ, నాటి దొరల పెత్తనాన్ని, వెట్టిచాకిరిని ఎదిరించిన తొలి మహిళ. విసునూరు దేశ్‌ముఖ్...