దళిత స్పీకర్‌పై బీఆర్ఎస్ అహంకారం తగదు అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ క్షమాపణ చెప్పాలి ఎస్సీ సెల్ నంగునూరు మండల అధ్యక్షుడు రాగుల కృష్ణ

నంగునూరు, సెప్టెంబర్ 7 (ప్రజావాణి): రాజ్యాంగబద్ధమైన గౌరవప్రదమైన పదవిలో ఉన్న దళిత స్పీకర్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అనుచిత వ్యాఖ్యలు, అసభ్య పదజాలం ఉపయోగించడాన్ని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నంగునూరు మండల అధ్యక్షుడు రాగుల కృష్ణ,సిద్దిపేట జిల్లా మాజీ ఎస్సీ సెల్ నాయకుడు రాగుల కనకయ్య తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు సోమవారం వారు ఒక ప్రకటనలో బీఆర్ఎస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రాగుల కృష్ణ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో స్పీకర్ పదవికి ప్రత్యేక గౌరవం ఉంటుందని...