prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 September 2026, 10:23 pm Digital Edition : RAJU NANGUNOOR

దళిత స్పీకర్‌పై బీఆర్ఎస్ అహంకారం తగదు అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ క్షమాపణ చెప్పాలి ఎస్సీ సెల్ నంగునూరు మండల అధ్యక్షుడు రాగుల కృష్ణ

నంగునూరు, సెప్టెంబర్ 7 (ప్రజావాణి):

రాజ్యాంగబద్ధమైన గౌరవప్రదమైన పదవిలో ఉన్న దళిత స్పీకర్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అనుచిత వ్యాఖ్యలు, అసభ్య పదజాలం ఉపయోగించడాన్ని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నంగునూరు మండల అధ్యక్షుడు రాగుల కృష్ణ,సిద్దిపేట జిల్లా మాజీ ఎస్సీ సెల్ నాయకుడు రాగుల కనకయ్య తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు సోమవారం వారు ఒక ప్రకటనలో బీఆర్ఎస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రాగుల కృష్ణ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో స్పీకర్ పదవికి ప్రత్యేక గౌరవం ఉంటుందని అన్నారు. అలాంటి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న దళిత స్పీకర్‌ను అసభ్య పదజాలంతో దూషించడం బీఆర్ఎస్ నాయకుల అహంకారానికి, దళిత వ్యతిరేక వైఖరికి నిదర్శనమని విమర్శించారు. పదవుల అహంకారంతో ప్రతిపక్ష నాయకులు విచక్షణ కోల్పోయి మాట్లాడటం సరికాదన్నారు.రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారిని గౌరవించడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అని పేర్కొన్నారు. దళిత స్పీకర్‌ను అవమానించడం అంటే మొత్తం దళిత సమాజాన్ని అవమానించినట్లేనని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని స్పీకర్‌కు, దళిత సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.