prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 7:20 am Digital Edition : PRAJA VANI

🏹 జాతీయ  “ఆర్చరీ ” క్రీడా పోటీలకు  ఎంపికైన కాచినపల్లి విద్యార్థిని”ఆవంతిక “

🏹 జాతీయ  “ఆర్చరీ ” క్రీడా పోటీలకు  ఎంపికైన  కాచినపల్లి  విద్యార్థిని 
“ఆవంతిక “

”  పాఠశాల క్రీడా కోచ్  మారెప్ప “

బూర్గంపాడు,(ప్రజావాణి)న్యూస్
సెప్టెంబర్ 19,.

గుండాల మండలం కాచినపల్లి  క్రీడా పాఠశాలకు  చెందిన విద్యార్థిని ఇస్లావత్ ” ఆవంతిక ” జాతీయ స్థాయి ఆర్చరీ క్రీడా పోటీలకు ఎంపికైంది. చిన్న వయసులోనే ఆర్చరీలో ప్రతిభ కనబరుస్తూ జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల  ఉపాధ్యాయులు, గ్రామస్తులు, క్రీడాభిమానులు, మరియు మీడియా మిత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆవంతిక తల్లిదండ్రులు  ఇస్లావత్. గాంధీ,  బుజ్జి అందిస్తున్న ప్రోత్సాహంతో పాటు, క్రీడా పాఠశాల కోచ్ మారెప్ప అందిస్తున్న శిక్షణ, మార్గదర్శకత్వంతో ఆమె ఈ స్థాయికి చేరుకుంది.

గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థిని జాతీయ స్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపిక కావడం  బూర్గంపహాడ్ మండలానికి ఎంతో గర్వకారణమని పలువురు పేర్కొన్నారు. జాతీయ స్థాయిలోనూ ఆవంతిక ప్రతిభ చాటుకుని మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలిపారు.

🏹 ఆవంతికకు హృదయపూర్వక అభినందనలు..  మరియు మరెన్నో విజయాలు సాధించాలని కొనియాడుతూ,  పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.