హోలీ రోసరీ పాఠశాల పై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం: కరస్పాండెంట్ ఫాదర్ సునీల్ స్పష్టత
కడప జిల్లా పోరుమామిళ్ల సెప్టెంబర్ 1 ప్రజావాణి మండల కేంద్రంలోని ప్రముఖ విద్యాసంస్థ ‘హోలీ రోసరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్’ పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా,ఇతర మాధ్యమాలలో వస్తున్న ఆరోపణలను ఆ పాఠశాల కరస్పాండెంట్ ఫాదర్ సునీల్ తీవ్రంగా ఖండించారు.ఈ మేరకు ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో (ప్రెస్ మీట్) మాట్లాడుతూ.. తనపై మరియు స్కూల్ యాజమాన్యంపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, నిరాధారమని స్పష్టం చేశారు. నియామకం డయాసిస్ పరిధిలోనే..నేను ప్రిన్సిపాల్‌ను కాదు: ఈ సందర్భంగా ఫాదర్ సునీల్...