prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 8:14 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

హోలీ రోసరీ పాఠశాల పై వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం:  కరస్పాండెంట్ ఫాదర్ సునీల్ స్పష్టత

కడప జిల్లా పోరుమామిళ్ల సెప్టెంబర్ 1 ప్రజావాణి మండల కేంద్రంలోని ప్రముఖ విద్యాసంస్థ ‘హోలీ రోసరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్’ పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా,ఇతర మాధ్యమాలలో వస్తున్న ఆరోపణలను ఆ పాఠశాల కరస్పాండెంట్ ఫాదర్ సునీల్ తీవ్రంగా ఖండించారు.ఈ మేరకు ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో (ప్రెస్ మీట్) మాట్లాడుతూ.. తనపై మరియు స్కూల్ యాజమాన్యంపై జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, నిరాధారమని స్పష్టం చేశారు.

నియామకం డయాసిస్ పరిధిలోనే..నేను ప్రిన్సిపాల్‌ను కాదు:

ఈ సందర్భంగా ఫాదర్ సునీల్ మాట్లాడుతూ, “నేను ఈ పాఠశాలకు కేవలం కరస్పాండెంట్‌గా మాత్రమే బాధ్యతలు నిర్వహిస్తున్నాను. నేను ప్రిన్సిపాల్‌ను కాదు. ఉన్నత క్రైస్తవ మత పెద్దల (డయాసిస్) ఆదేశాల మేరకు, వారి నియమ నిబంధనలకు అనుగుణంగానే నేను ఇక్కడ విధులను నిర్వర్తిస్తున్నాను. డయాసిస్ యాజమాన్యం ఏ విధంగా అయితే నన్ను ఇక్కడికి పంపించిందో, వారి మార్గదర్శకత్వంలోనే పాఠశాల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నాను” అని తెలిపారు.

పేద విద్యార్థులకు 50 శాతం రాయితీ – ఉన్నత విద్యా ప్రమాణాలు:

హోలీ రోసరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కేవలం వ్యాపార దృక్పథంతో కాకుండా, సేవా భావంతో నడుస్తోందని ఆయన గుర్తుచేశారు. ఈ ప్రాంతంలోని ఎంతోమంది పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన చదువును అందించాలనే లక్ష్యంతో యాజమాన్యం ఫీజులలో ఏకంగా 50 శాతం రాయితీ (డిస్కౌంట్) ఇస్తూ విద్యాబుద్ధులు నేర్పిస్తోందని చెప్పారు. క్రమశిక్షణతో కూడిన విద్య, ప్రతి ఏటా ఉత్తమ ఫలితాలు (మంచి మార్కులు) సాధిస్తూ పోరుమామిళ్ల మండలంలోనే ఈ స్కూల్ ఉన్నత స్థాయిలో ఉంటూ ఎనలేని గుర్తింపు తెచ్చుకుందని ఆయన గర్వంగా ప్రకటించారు.

కుట్ర పూరితంగానే తప్పుడు ఆరోపణలు.. ధర్నాలతో బెదిరింపులు:

ఇంతటి మంచి పేరున్న విద్యాసంస్థను, విద్యా ప్రమాణాలను దెబ్బతీయాలని కొంతమంది వ్యక్తులు పంతం కట్టుకుని కుట్రలు పన్నుతున్నారని ఫాదర్ సునీల్ ఆరోపించారు. స్కూల్ ప్రతిష్టను భంగపరచడమే లక్ష్యంగా కొందరు కావాలనే తప్పుడు ఆరోపణలు సృష్టిస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. అంతేకాకుండా, తనపై వ్యక్తిగతంగా కొంతమంది ధర్నాలు చేస్తూ, బెదిరింపులకు గురిచేస్తున్నారని.. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశార నిజానిజాలు తెలుసుకోకుండా చేస్తున్న ఇటువంటి దుష్ప్రచారాలను తల్లిదండ్రులు, ప్రజలు నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. పాఠశాల క్రమశిక్షణను, విద్యార్థుల భవిష్యత్తును కాపాడటానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని, చట్టంపై మరియు డయాసిస్ నిర్ణయాలపై తనకు పూర్తి నమ్మకం ఉందని ఫాదర్ సునీల్ ఈ ప్రెస్ మీట్ ద్వారా స్థానిక ప్రజలకు, మీడియాకు తెలియజేశారు.