prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 September 2026, 6:59 pm Digital Edition : MAHESH MEDCHAL

హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా భారీ స్కూటీ ర్యాలీ*

*హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా భారీ స్కూటీ ర్యాలీ*

*చార్మినార్‌ నుంచి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహం వరకు ఉత్సాహంగా ర్యాలీ*

సెప్టెంబర్‌ 17 నేడు న్యూస్:- వేడుకలను విజయవంతం చేయాలని బీజేపీ మహిళా నాయకుల పిలుపు
హైదరాబాద్, సెప్టెంబర్‌ 15: హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం నగరంలో భారీ స్కూటీ ర్యాలీ నిర్వహించారు. సెప్టెంబర్‌ 17న నిర్వహించనున్న హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, వేడుకలకు ప్రజలను పెద్ద సంఖ్యలో తరలివచ్చేలా పిలుపునిస్తూ ఈ ర్యాలీ చేపట్టారు. చార్మినార్‌ వద్ద ప్రారంభమైన స్కూటీ ర్యాలీ నగరంలోని ప్రధాన మార్గాల మీదుగా ఉత్సాహభరితంగా సాగింది. ర్యాలీకి మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై జాతీయ భావాన్ని చాటారు. అనంతరం ర్యాలీ అసెంబ్లీ సమీపంలోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహం వద్దకు చేరుకుంది. ర్యాలీ సందర్భంగా మహిళా నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటూ హైదరాబాద్‌ విమోచన దినోత్సవ ప్రాధాన్యతను ప్రజలకు వివరించారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్‌ బీజేపీ అధ్యక్షురాలు శైలజ హరినాథ్, ఎల్లంపేట మహిళా అధ్యక్షురాలు పుష్పలతతో పాటు మహిళా నాయకులు అనిత, సంధ్య, సుజాత, లావణ్య, సునీత తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సెప్టెంబర్‌ 17వ తేదీ హైదరాబాద్‌ చరిత్రలో ఎంతో ప్రాధాన్యత కలిగిన రోజని అన్నారు. హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన సందర్భంగా నిర్వహించే హైదరాబాద్‌ విమోచన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో భాగస్వాములు కావాలని కోరారు. సెప్టెంబర్‌ 17న సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న హైదరాబాద్‌ విమోచన దినోత్సవ కార్యక్రమానికి ప్రజలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చరిత్రను భావితరాలకు తెలియజేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వారు పేర్కొన్నారు. హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన స్కూటీ ర్యాలీ నగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ర్యాలీకి మరింత ఉత్సాహం నెలకొంది. సెప్టెంబర్‌ 17న జరిగే ప్రధాన కార్యక్రమాన్ని కూడా ఇదే స్ఫూర్తితో విజయవంతం చేయాలని నాయకులు కోరారు.