prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 12:53 pm Digital Edition : MAHESH MEDCHAL

హృదయ ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

హృదయ ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

ప్రపంచ హృదయ దినోత్సవ ర్యాలీలో వక్తల పిలుపు

ఎల్లంపేట్: ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మెడిసిటి హాస్పిటల్స్ ఆధ్వర్యంలో మంగళవారం ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని ఘనపూర్‌లో హృదయ ఆరోగ్యంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఘనపూర్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ హనుమాన్ టెంపుల్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా గుండె ఆరోగ్యం, గుండె సంబంధిత వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఘనపూర్ కౌన్సిలర్ నునావత్ పార్వతి తార్య నాయక్ మాట్లాడుతూ, ప్రస్తుత జీవనశైలిలో మార్పుల కారణంగా గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని అన్నారు. ప్రతిరోజూ కొంత సమయం వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, పొగతాగడం వంటి అనారోగ్యకరమైన అలవాట్లకు దూరంగా ఉండటం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు. ప్రజల్లో హృదయ ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.

కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ ఇనాక్షి మాట్లాడుతూ, ఆరోగ్యమే ప్రతి ఒక్కరికీ ప్రధాన సంపద అని అన్నారు. గుండెపోటు లక్షణాలను ముందుగానే గుర్తించి, వెంటనే వైద్య సహాయం పొందడం ఎంతో ముఖ్యమని తెలిపారు. ముఖ్యంగా యువత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ప్రతిరోజూ శారీరక వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, ఒత్తిడిని నియంత్రించుకోవడం వంటి అంశాలను జీవనశైలిలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ పవన్ శర్మ, వైద్యులు సమీర్, అజిల, ఐశ్వర్య, స్వప్న, మార్కెటింగ్ మేనేజర్ కుమారస్వామి, సంజయ్, నాగార్జున, నవీన్, రాజు, చేరాలు, సాయికుమార్, బాలకృష్ణ, మల్లికార్జున్, కవిత, అభిషేక్, మెడిసిటి హాస్పిటల్ వైద్య సిబ్బంది, ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.