హిందూ ధర్మంపై వ్యాఖ్యలకు నిరసన.. కూకట్‌పల్లిలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం!
కూకట్‌పల్లి, సెప్టెంబర్ 30 (ప్రజావాణి)
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలు హిందూ ధర్మానికి, హిందూ సమాజ ఆత్మగౌరవానికి అవమానకరమని నిరసిస్తూ కూకట్‌పల్లి నియోజకవర్గంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు పిలుపు మేరకు కూకట్‌పల్లి డివిజన్ అధ్యక్షుడు పి. దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి, ఆయన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొని ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఖండించారు.