హసన్‌పర్తి గాంధీనగర్‌లో ఘనంగా మహా కుంకుమ పూజ
గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భక్తిశ్రద్ధలతో 5వ రోజు వేడుకలు
వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటూ మహిళల సామూహిక కుంకుమ పూజ
విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో సుఖసంతోషాలు కలగాలని ప్రత్యేక ప్రార్థనలు
హసన్‌పర్తి, మన ప్రజవాణి:
గాంధీనగర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదవ రోజు శుక్రవారం తెల్లవారుజామున మహా కుంకుమ అభిషేక పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
పురోహితులు రమేష్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఒకరికొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటూ సాంప్రదాయబద్ధంగా కుంకుమ పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పురోహితులు రమేష్ శర్మ మహిళలకు కుంకుమ పూజ విధివిధానాలను వివరించారు. సమస్త లోకాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో సుధారాణి, సోనీ, సుమలత, సంహిత, వసంత, వైష్ణవి, పద్మ, సరోజన, స్వరూప, శ్రీలత, కవిత, పావని, సుజాత, స్రవంతి, లావణ్య, అనిత, పల్లవి, శ్రీజ, రేణుక, రమాదేవి, మాధవి, శ్వేత, జ్యోతి తదితర మహిళలు, కమిటీ సభ్యులు, గాంధీనగర్ పెద్దలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.