prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 8:17 pm Digital Edition : PRAJA VANI

హరి హారమహా క్షేత్రంలో రేపు భగవాన్ బలరాం జయంతి ఉత్సవాలు

**హరి హారమహా క్షేత్రంలో రేపు భగవాన్ బలరాం జయంతి ఉత్సవాలు.*
*
**భారతీయ కిసాన్ సాంగ్ మంచాల్ మండలం లో*

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మండల్ మంచాల: సెప్టెంబర్ 21 (ప్రజావాణి)

హరిహర మాహా క్షేత్ర దేవస్థాన సన్నిధిలో రేపు ఉదయం 9:00 గంటలకు భగవాన్ బలరాముని జయంతి. ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా మండలంలోని రైతులందరూ పెద్ద సంఖ్యలో హాజరై భగవాన్ బలరాముని ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు. ప్రతి రైతు ఈ కార్యక్రమంలో భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.

దేశవ్యాప్తంగా భగవాన్ బలరామ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో, మన గ్రామం, మండలంతో పాటు ప్రతి గ్రామంలోనూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనే ఉద్దేశంతో హరి హార మాహా క్షేత్ర దేవస్థాన సన్నిధిలో జయంతి వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులందరూ తప్పకుండా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.