*హమారా ప్రసాద్ అంబేద్కర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ దళిత సంఘాల నాయకులు పోలీసులకు ఫిర్యాదు*
•దళిత సంఘాల నాయకులు
మన సమగ్ర ప్రజావాణి (జోగిపేట )సెప్టెంబర్ 17 సంగారెడ్డి జిల్లా ప్రతినిధి
జోగిపేట: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అవమానించే విధంగా పుస్తకంలో వ్యాఖ్యలు చేశారంటూ నాగులారపు వరప్రసాద్ అలియాస్ హమారా ప్రసాద్‌పై దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుని అరెస్ట్ చేయాలని కోరుతూ జోగిపేట పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐకి ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం దళిత సమాజాన్ని, రాజ్యాంగ విలువలను అవమానించడమేనని పేర్కొన్నారు. సంబంధిత వ్యాఖ్యలపై సమగ్రంగా విచారణ జరిపి, చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
ఈ కార్యక్రమంలో మాల మహానాడు అధ్యక్షులు ఆందోల్ మల్లేశం, మాజీ జెడ్పీటీసీ బాయికడి భూమయ్య, తాలెల్మ కరుణాకర్, దళిత సంఘాల నాయకులు మొగులయ్య, సాంటేనోళ్ల సంజీవయ్య, పుర్ర సంతోష్, ఎర్రోళ్ల నర్సింలు, పెండా గోపాల్, కోడెకల్ నర్సింలు, బేగారి ప్రసాద్, మన్నే పోచయ్య, మన్నే పరిపూర్ణం, మన్నే నాగేష్, మన్నే ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.