prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 12:50 pm Digital Edition : MAHESH MEDCHAL

*హనుమాన్ నగర్‌లో ఘనంగా వినాయక నిమజ్జనోత్సవం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు*

*హనుమాన్ నగర్‌లో ఘనంగా వినాయక నిమజ్జనోత్సవం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు*

*భారీగా తరలివచ్చిన కాలనీ వాసులు భక్తులు*

*ముఖ్యఅతిథిగా హాజరైన కాంగ్రెస్ నాయకులు పాలకుర్తి రాఘవేందర్ గౌడ్, రామన్న గారి శ్రీనివాస్ గౌడ్*

మేడ్చల్, : హనుమాన్ నగర్ కాలనీలో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో, ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. వినాయక ఉత్సవాల ముగింపు సందర్భంగా కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం గణనాథుడి నిమజ్జనాన్ని వైభవంగా చేపట్టారు. నిమజ్జన వేడుకల్లో కాలనీ ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేశారు.

నిమజ్జన కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరై వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కాలనీలో ప్రశాంత వాతావరణంలో వినాయక ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమని తెలిపారు.

కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన కాంగ్రెస్ నాయకులు పాలకుర్తి రాఘవేందర్ గౌడ్, రామన్న గారి శ్రీనివాస్ గౌడ్, చామకూర మహేందర్ రెడ్డి, మాజీ గ్రంధాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్, మాజీ వైస్ చైర్మన్ చిర్ల రమేష్, మాజీ కో ఆప్షన్ సభ్యులు అకిటి నవీన్ రెడ్డి చిర్ల ఆకాష్, ఐ ఎన్ టి యు సి ఆటో యూనియన్ అధ్యక్షుడు ఎర్ర విజయ రావు, పాల్గొన్న రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులను వినాయక మండప నిర్వాహకులు చింటు తావుల, భారత్ తావుల, శ్రవణ్, శివ తావుల, త్రినాథ్, సాయి, కల్యాణ్, బన్నీ, చంటి, శివ శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. మండప సభ్యులు, యువకులు కలిసి నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. మహిళలు, చిన్నారులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది.

ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ.. హనుమాన్ నగర్ కాలనీలో నిర్వహించిన వినాయక నిమజ్జన కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వారి రాకతో నిర్వాహకులు, యువతలో మరింత ఉత్సాహం ఏర్పడిందని తెలిపారు. వినాయక ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన కాలనీ ప్రజలకు, మండప సభ్యులకు, యువతకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

భక్తుల భాగస్వామ్యం, యువత ఉత్సాహం, నిర్వాహకుల సమన్వయంతో హనుమాన్ నగర్ కాలనీలో వినాయక నిమజ్జన వేడుకలు విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా గణనాథుడికి వీడ్కోలు పలికిన భక్తులు వచ్చే ఏడాది మరింత ఘనంగా ఉత్సవాలు నిర్వహించాలని ఆకాంక్షించారు.