స్వయం ఉపాధిపై యువత దృష్టి సారించాలి
అలియాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి
మేడ్చల్, ప్రజావాణి:- యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా సొంత వ్యాపారాలపై దృష్టి సారించి, తాము ఎదగడంతో పాటు మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకోవాలని అలియాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి సూచించారు. బుధవారం అలియాబాద్ మున్సిపల్ కేంద్రంలో మేడిపల్లి శివ నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ కట్ట మైసమ్మ వెల్డింగ్ షాప్ను స్థానిక కౌన్సిలర్లతో కలిసి చైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువతలో వ్యాపార దృక్పథం పెరగాలని, స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందడంతో పాటు ఇతరులకు కూడా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని అన్నారు.
సొంత వ్యాపారంపై దృష్టి సారించి వెల్డింగ్ షాప్ ఏర్పాటు చేసిన మేడిపల్లి శివను చైర్‌పర్సన్ అభినందించారు. యువతకు ఇటువంటి స్వయం ఉపాధి కార్యక్రమాలు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ కాన్‌రెడ్డి మాలతి మాధవరెడ్డి, కౌన్సిలర్లు మౌనిక దినేష్, యమున శ్యామ్, జస్వంత్ రెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.