స్వచ్ఛత హి సేవ లో భాగంగా చండూరు మున్సిపాలిటీలో హెల్త్ క్యాంపు
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి చండూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో “స్వచ్ఛత హి సేవ” కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం 9:30 గంటలకు స్థానిక గెస్ట్ హౌస్ నందు హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ డా. కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ పారిశుధ్య సిబ్బంది ప్రతిరోజూ పట్టణ పరిశుభ్రత, ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ఎండ, వర్షం వంటి వాతావరణ పరిస్థితులను సైతం లెక్కచేయకుండా ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు అందిస్తున్న సిబ్బంది సేవలు అభినందనీయమని తెలిపారు....