శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఎండపల్లి మండలం రాజారంపల్లిలోని వివేకానంద విగ్రహం వద్ద మంగళవారం కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. స్పీకర్ పదవికి గౌరవం ఇవ్వాలని, బాధ్యతాయుత స్థానాల్లో ఉంటూ అసభ్యకరంగా మాట్లాడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ పార్టీ మద్దతుపై కేసీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో గెల్లు చంద్రశేఖర్, కందికట్ల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.