స్థానిక సంస్థల ఎన్నికల కోసమే కొత్త పెన్షన్ల నాటకం: మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి తీవ్ర విమర్శలు
పోరుమామిళ్ల సెప్టెంబర్ 9 ప్రజావాణి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతుండటంతోనే కూటమి ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరు అంశాన్ని తెరపైకి తెచ్చిందని మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గడిచిన దాదాపు రెండున్నర సంవత్సరాల కాలంలో ఒక్క కొత్త పెన్షన్‌ను కూడా మంజూరు చేయలేదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న తీవ్ర వ్యతిరేకతను, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై వస్తున్న అసంతృప్తిని కప్పిపుచ్చుకోవడానికే ఇప్పుడు పెన్షన్ల పంపిణీకి సిద్ధమవుతున్నారని...