*సొమ్మక్కడివి శోకొక్కడిది అనే చందాన అధికార పార్టీ నాయకులు*
– అధికారులు కలెక్టర్ తీరును ఖండిస్తున్న బిజెపి మండల శాఖ
ప్రజావాణి/ఎల్లారెడ్డిపేట
మండల కేంద్రంలోని కిష్టం పల్లి మరియు బస్టాండు ఏరియాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిధుల నుండి మంజూరై ప్రారంభోత్సవానికి ముస్తాబై ఆయుష్మాన్ భారత్ పల్లె దావాఖానా , ప్రారంభోత్సవానికి భారతీయ జనతా పార్టీ నాయకులకు ఆహ్వానం లేదు అని భారతీయ జనతా పార్టీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు మాలోత్ కిరణ్ నాయక్ మరియు జిల్లా కౌన్సిల్ మెంబర్ చందుపట్ల లక్ష్మారెడ్డి మరియు బి.జెపి వార్డు మెంబర్స్ గంట బాలకృష్ణ మరియు కొత్త చేన్నయ్య అధికారులను ప్రశ్నించగా జవాబు లేక ఒక అధికారి పేరు ఒకరు చెప్పుకుంటూ దాటవేసే ధోరణితో సంజాయిస్ ఇవ్వలేక ముఖం దాటేసిన వైనం. సొమ్మొకడిది సోకొక్కరిది అనే చందాన వివిధ పార్టీల నాయకులు తో కలిపి కలెక్టర్ అధికారికంగా ప్రారంభించారు
దీన్ని భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరపున తప్పుపడుతూ ప్రజల సంక్షేమం కొరకు భారతీయ జనతా పార్టీ నాయకులు అహర్నిశలు ప్రజల సమస్యలను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో ప్రజాప్రయోజనాలను సమకూర్చే విధంగా బిజెపి నాయకులు కృషి చేస్తా ఉంటే
అధికార పార్టీ చెప్పు చేతల్లో కలెక్టర్ అధికారులు భారతీయ జనతా పార్టీ నాయకులను ఆహ్వానించకుండా అవమానపరుస్తూ అన్ని పార్టీల నాయకులను సమదృష్టితో చూడాల్సినటువంటి అధికారులు కలెక్టర్, అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ చేస్తున్నటువంటి పనులను భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఇటువంటి పరిస్థితులు మళ్లీ ఎదురైతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు