సేవా సంకల్ప్ అభియాన్’..క్షేత్రస్థాయిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానాలు.
సేవా స్ఫూర్తితో అంగన్‌వాడీల బలోపేతం చిన్నారులు, తల్లుల సంక్షేమమే బిజెపి లక్ష్యం కాశినాయన:సెప్టెంబర్ 26ప్రజావాణి గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తూ, మహిళలు, గర్భిణీల ఆరోగ్య సంరక్షణలో అహర్నిశలు శ్రమిస్తున్న అంగన్‌వాడీ సిబ్బంది సేవలకు అరుదైన గౌరవం దక్కింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని శ్రీ అవదూత కాశినాయన మండలం గంగనపల్లె గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో 'సేవ సంకల్ప అభియాన్ - అంగన్‌వాడీ ఉత్సవం' అత్యంత వైభవంగా నిర్వహించారు. బీజేవైఎం రాష్ట్ర నాయకులు, సేవ సంకల్ప అభియాన్ అంగన్‌వాడీ...