prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 6:02 pm Digital Edition : PRAJA VANI

సెలవు పై వెళ్లిన తాళ్లపల్లి పశు వైద్యశాల ఎల్ ఎస్. ఏ గోపిరెడ్డి….

సెలవు పై వెళ్లిన తాళ్లపల్లి పశు వైద్యశాల ఎల్ ఎస్. ఏ గోపిరెడ్డి….

రంగారెడ్డి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 10. ప్రజావాణి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని తాళ్లపల్లి గ్రామంలో నీ పశువైద్యశాలలో ఎల్ ఎస్ ఏ గా విధులు నిర్వహిస్తున్న గోపిరెడ్డి. ప్రస్తుతం గత వారం రోజుల నుండి సెలవు పై ఉండడంతో తాళ్లపల్లి గ్రామానికి చెందిన కొంత మంది రైతుల పశువులకు రోగాలకు సంబంధించి చికిత్స నిమిత్తం వేరే గ్రామాలకు వెళ్లాల్సిన పరిస్థితి దాపురించిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ప్రజావాణి రంగారెడ్డి జిల్లా బ్యూరో తాళ్లపల్లి గ్రామాల ప్రజల విన్నపాల నిన్న అనంతరం తాళ్లపల్లి ఎల్ ఎస్ ఏ గోపిరెడ్డి తో మాట్లాడుతూ గత వారం రోజుల నుండి తాను సెలవులో ఉన్నానని ఇట్టి సెలవు ఈనెల 21 వరకు ముగుస్తుందని తాళ్లపల్లి దాని మారుమూల గ్రామాల రైతుల మూగజీవాలకు చికిత్స చేయడానికి వేరే గ్రామాలకు వెళ్లకుండా గ్రామంలోనే బాలరాజ్ అనే వ్యక్తిని తాళ్లపల్లి అసిస్టెంట్ గా అత్యవసర సమయంలో గ్రామంలోని పశువుల చికిత్స నిమిత్తం అందుబాటులో ఉంటారని గోపిరెడ్డి ప్రజావాణి విలేఖరికి వివరించారు. ఈ నెల 21వ తేదీన తాను విధులకు హాజరవుతున్నట్లు తాళ్లపల్లి దాని మారుమూల గ్రామాల రైతులు గమనించాలని పేర్కొన్నారు.