సెయింట్ థామస్ పాఠశాలలో ఘనంగా వినాయక నిమజ్జనం

సెయింట్ థామస్ పాఠశాలలో ఘనంగా వినాయక నిమజ్జనం ఆటపాటలు, కోలాటాలతో విద్యార్థుల సందడి – భక్తిశ్రద్ధలతో గణనాథుడికి వీడ్కోలు ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:- ఎల్కతుర్తి మండలంలోని సెయింట్ థామస్ పాఠశాలలో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండలంలోనే ప్రత్యేకంగా మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించిన అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు భక్తిశ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టారు. వినాయక నవరాత్రుల సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు ప్రతిరోజూ భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిమజ్జన కార్యక్రమంలో భాగంగా...