సెయింట్ థామస్ అల్టిట్యూడ్ పాఠశాలలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

సెయింట్ థామస్ అల్టిట్యూడ్ పాఠశాలలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:- ఎల్కతుర్తి మండల కేంద్రంలోని సెయింట్ థామస్ అల్టిట్యూడ్ హై స్కూల్‌లో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి. చిన్నారులు రాధాకృష్ణుల వేషధారణలో ముస్తాబై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆటపాటలు, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాఠశాల ఆవరణ సందడిగా మారింది. వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఉట్టి కొట్టే కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఉట్టి కొట్టేందుకు పోటీపడ్డారు....