prajavaani.net
Newspaper Banner
Date of Publish : 04 September 2026, 7:36 pm Digital Edition : SURENDHAR MAHEBUBABAD

సెప్టెంబర్ 12న లోక్ అదాలత్

సెప్టెంబర్ 12న లోక్ అదాలత్

 

*రాజీమార్గమే రాచమార్గం*

*తొర్రూర్ ఎస్సై మహేందర్ రెడ్డి*

రాజీమార్గమే రాచమార్గమని తొర్రూరు ఎస్సై మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ
ప్రజలకు మరింత చేరువగా న్యాయసేవలను అందించేందుకు తెలంగాణ రాష్ట్ర పోలీసుల ఆధ్వర్యంలో ఈనెల సెప్టెంబర్ 12వ తేదీన లోక్ అదాలత్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ మేరకు తోర్రూరు ప్రజలకు ముఖ్యమైన సమాచారాన్ని తెలియజేశారు. ఈ లోక్ అదాలత్ ద్వారా ప్రజలకు సంబంధించిన లేదా వారిపై నమోదైన చిన్న చిన్న కేసులను ఇరువర్గాల అంగీకారంతో రాజీ మార్గంలో ఎలాంటి ఖర్చు లేకుండా త్వరితగతిన పరిష్కరించుకునే అద్భుతమైన అవకాశం ఉంటుందని, కోర్టుల చుట్టూ తిరిగే సమయాన్ని ధనాన్ని ఆదా చేసుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఎస్ఐ పేర్కొన్నారు. కావున తమపై ఉన్న చిన్న చిన్న వివాదాలు లేదా సివిల్ కాంపోనెంట్ క్రిమినల్ కేసులను సామరస్యపూర్వకంగా ముగించుకోవాలనుకునే సంబంధిత వ్యక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కేసుల పరిష్కారం కోసం పూర్తి వివరాల కొరకు వెంటనే స్థానిక తోర్రూరు పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ఎస్ఐ మహేందర్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.