prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 September 2026, 8:19 am Digital Edition : NAGARAJU SHANKARAMPET

సూరారం గ్రామంలో వి బి జి రామ్ జి ప్రణాళిక తయారీ గ్రామసభ

చిన్నశంకరంపేట, ఆగస్టు31, మన ప్రజావాణి: మండల పరిధిలోని సూరారం గ్రామంలో సోమవారం రోజున మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో నూతనంగా వచ్చినటువంటి వి బి జి రామ్ జి పథకం గురించి సర్పంచ్ చిలక నాగరాజువిఅవగాహన కల్పిస్తూ నూతనంగా వచ్చినటువంటి వి బి జీ రామ్ జి పథకంలో ఉన్నటువంటి పనులు ఈ 2026-2027 ఆర్థిక సంవత్సరం లో గ్రామంలో చేపట్టవలసినటువంటి పనుల గురించి గ్రామసభ ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తూ వ్యక్తిగతంగా వ్యవసాయ ఆధారితంగా చేసుకోవలసినటువంటి పనులు మరియు కమ్యూనిటీ లో భాగంగా చేయవలసినటువంటి పనులు మరియు వివిధ శాఖల అనుసంధానంతో వి.బి.జి.రాంజీ పథకంలో చేపట్టబోయే పనులకు గ్రామ సభ ద్వారా గుర్తించి ప్రణాళిక తయారు చేయడం గురించి గ్రామసభలో చర్చించడం జరిగింది.ఈ గ్రామసభలో గ్రామ సర్పంచ్ చిలుక నాగరాజు వార్డు సభ్యులు పంచాయతీ కార్యదర్శి నాంపల్లి, వీ.బి. జీ.రాంజీ పథక ఈసీ సంపత్ టెక్నికల్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ గ్రామ పెద్దలు ఉపాధి హామీ కూలీలు పాల్గొనడం జరిగింది.