prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 10:51 am Digital Edition : UPPU RAMESH JAGITHYAL

సూరారంలో శోభాయమానంగా వినాయక మండపం వద్ద సామూహిక దీపారాధన

ఎండపల్లి మండలం సూరారం గ్రామంలో శ్రీ గణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద శనివారం రోజున సామూహిక దీపారాధన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. గణనాథునికి ప్రత్యేక పూజల అనంతరం భక్తులు జై గణేష్ నామస్మరణతో దీపాలు వెలిగించడంతో మండపం ఆధ్యాత్మిక శోభతో విలసిల్లింది. యూత్ సభ్యుల సమన్వయంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు jపెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. పూజల అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. భవిష్యత్తులో మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తామని సభ్యులు తెలిపారు.