prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 11:02 pm Digital Edition : MAHESH MEDCHAL

సుతారిగూడ ,గౌడవల్లిలో ఘనంగా వినాయక పూజ, అన్న ప్రసాదం లడ్డు వేలం కార్యక్రమంలో పాల్గొన్న గరిసెల సురేందర్ ముదిరాజ్*

గుండ్ల పోచంపల్లి, సుతారిగూడ ,గౌడవల్లిలో ఘనంగా వినాయక పూజ, అన్న ప్రసాదం లడ్డు వేలం కార్యక్రమంలో పాల్గొన్న. గరిసెల సురేందర్ ముదిరాజ్*

గుండ్లపోచంపల్లి: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని, గుండ్ల పోచంపల్లి సుతారిగూడ, గౌడవల్లిలలో ఆయా అసోసియేషన్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గుండ్లపోచంపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం మాజీ అధికార ప్రతినిధి, మాజీ సర్పంచ్ గరిసెల సురేందర్ ముదిరాజ్ గారు, మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, యువజన సంఘాల ప్రతినిధులతో కలిసి శ్రీ వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తున్న యూత్ అసోసియేషన్ సభ్యులను ఈ సందర్భంగా *సురేందర్ ముదిరాజ్* అభినందించారు. యువత ఐక్యతతో ముందుకు సాగుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, యూత్ అసోసియేషన్ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.