*సుతారిగూడలో బొజ్జ గణపతికి ప్రత్యేక పూజలు*
*సుతారిగూడలో బొజ్జ గణపతికి ప్రత్యేక పూజలు* గణపయ్యను దర్శించుకున్న మాజీ కౌన్సిలర్ సాయిపేట శ్రీనివాస్ గుండ్లపోచంపల్లి, సెప్టెంబర్ 23: గుండ్లపోచంపల్లి 299వ డివిజన్ పరిధిలోని సుతారిగూడలో గణేష్ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సుతారిగూడలో ప్రతిష్టించిన బొజ్జ గణపతికి బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుండ్లపోచంపల్లి మాజీ కౌన్సిలర్, 299వ డివిజన్ మాజీ అధ్యక్షుడు సాయిపేట శ్రీనివాస్ హాజరై గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గణపయ్యకు పూజలు చేసి, ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో...