సీనియర్ రాజకీయ నాయకులు చక్రపాణి కన్నుమూత
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గొడిసెలపేట గ్రామానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకులు తంగళ్ళపల్లి చక్రపాణి (55) మంగళవారం రాత్రి కన్నుమూశారు. గత మూడు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. చక్రపాణి గతంలో నీటి సంఘాల చైర్మన్‌గా, సతీమణితో కలిసి గొడిసెలపేట సర్పంచ్‌గా, ప్రజాసేవ అందించారు. బిజెపి, కాంగ్రెస్, బిఆర్ఎస్ (టిఆర్ఎస్) పార్టీల్లో మండల స్థాయిలో కీలక నాయకుడిగా పనిచేశారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, స్థానిక నాయకులు తీవ్ర సంతాపం తెలిపారు.