prajavaani.net
Newspaper Banner
Date of Publish : 14 September 2026, 3:31 pm Digital Edition : PRAJA VANI

సీతారాంపూర్‌లో వినాయక చవితి వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు

సీతారాంపూర్‌లో వినాయక చవితి వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు
సీతారాంపూర్, సెప్టెంబర్ 14, ప్రజావాణి: వినాయక చవితి పండుగను పురస్కరించుకుని సీతారాంపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ తోపకుండా పావని చెన్నయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. పండుగ సందర్భంగా గ్రామంలోని ప్రధాన ప్రాంతాల్లో వెలుతురు సౌకర్యం మెరుగుపరిచేందుకు రెండు హైమాక్స్ లైట్లను ఏర్పాటు చేశారు.
పండుగ రోజుల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్రామంలో అవసరమైన మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సర్పంచ్ తెలిపారు. హైమాక్స్ లైట్ల ఏర్పాటుతో రాత్రి వేళల్లో గ్రామ ప్రజలకు, వినాయక మండపాల వద్ద భక్తులకు మెరుగైన వెలుతురు అందుబాటులోకి వచ్చింది.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలు సర్పంచ్ తోపకుండా పావని చెన్నయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.