prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 4:03 pm Digital Edition : PRAJA VANI

సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ ఆందోళన

సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ ఆందోళన

బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

బెజ్జంకి, సెప్టెంబర్ 29 (ప్రజావాణి)

హిందూ దేవుళ్లపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ సిద్దిపేట జిల్లా బీజేపీ బెజ్జంకి మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన నిర్వహించారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.బీజేపీ బెజ్జంకి మండల అధ్యక్షులు కొలిపాక రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ.. ‘పేదోళ్లకు శివుడు.. ఉన్నోళ్లకు రాముడు’ అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. హిందూ దేవుళ్లను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం సీఎం స్థాయికి తగదని అన్నారు. గునుకుల కొండాపూర్ సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ మాట్లాడుతూ.. సీఎం వ్యాఖ్యలు హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని, వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ
కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి సంగా రవి, మండల నాయకులు దొమ్మతి రాములు, సాన వేణు, లోనే నర్సింగం, బుర్ర కిషన్, నేతి మహేష్, బోనగం నరేష్, దోనే అంజన్న, కొంకటి గణేష్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.