prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 11:07 am Digital Edition : BALAKRISHNA BIRKOOR

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేసిన సర్పంచ్ అనిల్ కుమార్

బరంగ్ ఎడ్గిలో లబ్ధిదారునికి రూ.22 వేల చెక్కు అందజేత
బరంగ్ ఎడ్గి గ్రామంలో సర్పంచ్ రెంజర్ల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన దీపని సంజుకు రూ.22,000 విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కును సర్పంచ్ రెంజర్ల అనిల్ కుమార్ అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులతో వైద్యం చేయించుకునే కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా అందుతున్న ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ప్రజలకు అవసరమైన సమయంలో తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ అండగా ఉంటామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఉప సర్పంచ్ ప్రవీణ్, వార్డు సభ్యులు అన్నం అనిల్, వడ్ల యాదవ్ రావు, గైనీ సాయిలు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగోండ, లక్కపల్లి శ్రీనివాస్, అమృత్, ప్రభు, నాగరాజు, మొగులుగొండ, బోధనం సాయిలు, గౌతమ్, వివేక్‌తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.