prajavaani.net
Newspaper Banner
Date of Publish : 30 September 2026, 4:48 pm Digital Edition : PRAJA VANI

సిరిసిల్ల సభకు బెజ్జంకి మండల నుండి భారీగా తరలిన కాంగ్రెస్ శ్రేణులు

సిరిసిల్ల సభకు బెజ్జంకి మండల నుండి భారీగా తరలిన కాంగ్రెస్ శ్రేణులు

బెజ్జంకి, సెప్టెంబర్ 30 (ప్రజావాణి)

సిరిసిల్లలో బుధవారం నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్‌రెడ్డి హాజరవుతున్న సందర్భంగా బెజ్జంకి మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా తరలివెళ్లారు.బెజ్జంకి పీఏసీఎస్ చైర్మన్ ఒగ్గు దామోదర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సభకు బయలుదేరారు.
ముఖ్యమంత్రి సభ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా తరలిరావడంతో మండలంలో సందడి నెలకొంది.ఈ కార్యక్రమంలో గుడెల్లి శ్రీకాంత్, ముక్కిస కవిత రత్నాకర్‌రెడ్డి, గుర్రాల అనురాధ, బాల్ నరసింహారెడ్డి, బైరి మానస రాజేందర్, జెట్టి రమేష్, గాజ రవళి శ్రీనివాస్, తిరుపతి, సురేష్, సోషల్ మీడియా కన్వీనర్ కుంట హరికృష్ణతో పాటు అన్ని గ్రామాల సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.