prajavaani.net
Newspaper Banner
Date of Publish : 30 September 2026, 4:29 pm Digital Edition : PRAJA VANI

సిరిసిల్ల సభకు తరలిన కాంగ్రెస్ నాయకులు

సిరిసిల్ల సభకు తరలిన కాంగ్రెస్ నాయకులు

గుగ్గిళ్ల, తిమ్మాయిపల్లి నుంచి పెద్ద సంఖ్యలో హాజరు

బెజ్జంకి, సెప్టెంబర్ 30 (ప్రజావాణి)

సిరిసిల్లలో నిర్వహించిన సభకు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల, తిమ్మాయిపల్లి గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. పార్టీ పిలుపు మేరకు గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు సిరిసిల్లకు చేరుకుని సభలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు కార్యకర్తలు ఐక్యంగా ముందుకు సాగుతున్నారని తెలిపారు.పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు సభకు తరలివెళ్లడంతో గ్రామాల్లో రాజకీయ సందడి నెలకొంది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గుగ్గిళ్ల గ్రామ శాఖ అధ్యక్షులు దూశెట్టి ప్రశాంత్ రెడ్డి, గ్రామ శాఖ ఉపాధ్యక్షులు సుధమళ్ళ ప్రశాంత్ ,బెజ్జంకి మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బోయినీ ప్రశాంత్,తిమ్మాయపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాటికొండ రాజేందర్, పిఎసిఎస్ డైరెక్టర్ అపర్ణ,తిప్పరవేణి బాబు, తులిశాల శేఖర్, తిప్పరవేణి రాజు,వార్డు దుశెట్టి రాజు రెడ్డి లింగాల సురేష్, ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు గుగ్గిళ్ల సోము లింగం,గుగ్గిళ్ల, తిమ్మాయిపల్లి గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీనాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.