prajavaani.net
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 4:25 pm Digital Edition : PRAJA VANI

సిపిఐ మండల కన్వీనర్ గా బుడమ వెంకన్న

సిపిఐ మండల కన్వీనర్ గా బుడమ వెంకన్న
డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి సెప్టెంబర్ 20 ప్రజావాణి:
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కురవి మండల కన్వీనర్ గా బుడమ వెంకన్న ను ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు.

కురవి మండల కేంద్రం పార్టీ కార్యాలయంలో జరిగిన మండల పార్టీ కార్యవర్గ సమావేశంలో కురవి గ్రామానికి చెంది నాలుగు దశాబ్దాలుగా సిపిఐ లో పని చేస్తూ,సొసైటీ డైరెక్టర్ గా పనిచేసి, రైతు సంఘం మండల అధ్యక్షులుగా పనిచేస్తున్న బుడమ వెంకన్న ను పార్టీ కన్వినర్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
నా ఎన్నికకు సహకరించిన జిల్లా సహాయ కార్యదర్శి, ఆత్మ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు నెల్లూరు నాగేశ్వరావు కి, పార్టీ మండల నాయకత్వానికి ధన్యవాదములు తెలియజేసారు
మండలంలో బలమైన ప్రజా పోరాటాలు నిర్మిస్తూ, పార్టీ విస్తరణకు తోడ్పడతానని అన్నారు