prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 September 2026, 4:40 pm Digital Edition : PRAJA VANI

సిద్ధిఖీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద కార్యక్రమం విజయవంతం

సిద్ధిఖీ ఆధ్వర్యంలో అన్న ప్రసాద కార్యక్రమం విజయవంతం
మన ప్రజావాణి ప్రతినిధి (సంగారెడ్డి సెప్టెంబర్ :22)

సహకరించిన ప్రతి ఒక్కరికీ ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ కృతజ్ఞతలు

సంగారెడ్డి: ఛత్రపతి శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్న ప్రసాద కార్యక్రమం విజయవంతంగా జరిగింది. కార్యక్రమానికి హాజరై తమ విలువైన సమయాన్ని కేటాయించి సహకరించిన ప్రతి ఒక్కరికీ అసోసియేషన్ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా సిద్ధిఖీ అన్న, ప్రదీప్ అన్న అందించిన సేవలను అసోసియేషన్ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు. అన్న ప్రసాదం పూర్తయిన సమయంలో కూడా అదనంగా 25 కిలోల అన్నం వడ్డించి భక్తులందరికీ ప్రసాదం అందేలా కృషి చేసిన వారి సేవాభావాన్ని కొనియాడారు.

అలాగే 54 రకాల ప్రసాదాలను భక్తిశ్రద్ధలతో తయారుచేసి అందించిన మహిళా సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వారి శ్రమ, భక్తి, సహకారంతో కార్యక్రమం మరింత ప్రత్యేకంగా నిలిచిందని పేర్కొన్నారు.

శ్రీ విఘ్నేశ్వరుని ఆశీస్సులు అందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు ఆకాంక్షించారు.