prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 5:45 pm Digital Edition : PRAJA VANI

సాయిలు కుటుంబాన్ని పరామర్శించిన రెడ్యా

సాయిలు కుటుంబాన్ని పరామర్శించిన రెడ్యా
డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి , సెప్టెంబర్ 19, ప్రజావాణి :
కురవి మండలం మోదుగులగూడెం గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్ నాయకులు గునిగంటి సాయిలు అనారోగ్యంతో ఇటివల మృతి చెందారు. విషయం తెలుసుకున్న డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు బజ్జూరి పిచ్చిరెడ్డి, బీఆర్‌ఎస్‌వీ జిల్లా యువజన నాయకులు రవి నాయక్, గ్రామ పార్టీ సీనియర్ నాయకులు ఐలి నరహరి, గండి వెంకటమల్లు, యువజన నాయకులు ఐలి వీరేందర్ గౌడ్, వల్లపు యాకన్న, తీగల రఫీ, గునిగంటి వీరన్న తదితరులు పాల్గొన్నారు.