prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 12:18 pm Digital Edition : UPPU RAMESH JAGITHYAL

సాధన జూనియర్ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు

​పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని సాధన జూనియర్ కళాశాలలో శుక్రవారం రోజున ఫ్రెషర్స్ డే వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ గాజానవేని కుమార్, డైరెక్టర్లు అన్నాడి మల్లారెడ్డి, ఏనుగు మల్లారెడ్డి, కళ్ళెం స్వామి రెడ్డి పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. అధ్యాపక బృందం, విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. నూతన విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు.