సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిని నియమించాలంటూ విద్యార్థుల రాస్తారోకో
*సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిని నియమించాలంటూ విద్యార్థుల రాస్తారోకో* ప్రజావాణి బయ్యారం, సెప్టెంబర్ 17: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని ప్రాథమిక బాలికల ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడి పోస్టును వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు గురువారం రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. గత రెండు సంవత్సరాలుగా తమ పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమైన సబ్జెక్టుకు ఉపాధ్యాయుడు లేకపోవడంతో విద్యార్థుల చదువుపై ప్రభావం...