సర్టిఫికెట్ అడిగితే అధికారిణి దురుసు ప్రవర్తన: బాధితురాలి ఆవేదన

*సర్టిఫికెట్ అడిగితే అధికారిణి దురుసు ప్రవర్తన: బాధితురాలి ఆవేదన* *ముదిగొండ మండలం మల్లారంలో వివాదం.. కలెక్టర్ జోక్యం చేసుకోవాలని రమ్య డిమాండ్* ముదిగొండ సెప్టెంబర్ 22 ప్రజావాణి ప్రతినిధి ప్రభుత్వ పథకాలు, అవసరాల నిమిత్తం ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకుంటే అధికారులు నిర్లక్ష్యంగా, అవమానకరంగా వ్యవహరిస్తున్నారని ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మల్లారం గ్రామానికి చెందిన వనం రమ్య (భర్త: వనం శేషు) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వల్లభి–మల్లారం పరిధిలో విధులు నిర్వహిస్తున్న రెవెన్యూ విభాగ అధికారిణి (జి పి ఓ)...