సన్ రైజర్సస్కూల్ ను వెంటనే సీజ్ చేయాలి ఎంఎస్ యుుఐ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి బి సి నగేష్
బెలుగుప్ప సెప్టెంబర్ 30 ప్రజావాణి సరైన వసతులు లేకుండా విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తు రేకులు షెడ్లలో క్లాసులు నిర్వహిస్తున్న సన్రైజర్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ను వెంటనే సీజ్ చేయాలని ఎమ్మెస్ యు ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనవల బీసీ నగేష్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు 250 మందికి పైగా విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని విద్యార్థులు కనీస వసతులు ఆట స్థలం లేకపోవడం సోషనీయం ఈ స్కూల్ నందు లోపలకి వెళ్లడానికి సరైన గేటు, వెంటిలేటర్స్ గాని
లేకపోవడంతో విద్యార్థులు ఒకరిబిక్కిరిగా అయ్యే అవకాశం ఉందన్నారు దీనికి తోడు రేకుల షెడ్లతో గదులు ఉండటంతో సాధారణ ఎండలు వచ్చినా కూడా విపరీతమైన ఉక్కు పోతా ఉంటుందన్నారు దీనికి తోడు ఇరుకుగా గదులు అనుకుంటే మొక్కలు ఉండటం వల్ల విపరీతమైన దోమలు వచ్చే అవకాశం ఉందన్నారు కావున సంబంధిత మండల విద్యాధికారి స్కూలు సందర్శించి వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షాన దశలవారీగా ఉద్యమిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు సంజీవ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు