సచివాలయ ఉద్యోగులపై ప్రభుత్వం ఉక్కుపాదం.రూ.40 వేల కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించాలి: మాజీ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి, ధ్వజం
అమరావతి:సెప్టెంబర్ 28ప్రజావాణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై మాజీ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి మరియు ఏపీ ఉద్యోగుల సంఘం జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్ల సాధన కోసం జరుగుతున్న శాంతియుత నిరసనలపై ప్రభుత్వం పోలీసుల ద్వారా ఉక్కుపాదం మోపడం దుర్మార్గమని వారు ఆరోపించారు. పోలీసుల దౌర్జన్యం - ఉద్యోగుల భయభ్రాంతులు: గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు...