సంగెం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సంగెం ఎస్సై వంశీకృష్ణ జన్మదిన వేడుకలు
-కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసిన మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేల్పుల అనిల్ యాదవ్
,సెప్టెంబర్ 28 ప్రజావాణి న్యూస్/సంగెం
సంగెం మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) వంశీకృష్ణ జన్మదిన వేడుకలు ప్రెస్ క్లబ్ భవనంలో ఘనంగా నిర్వహించారు. ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షుడు వేల్పుల అనిల్ యాదవ్ నేతృత్వంలో సోమవారం ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేశారు. అనంతరం ప్రెస్ క్లబ్ ప్రతినిధులు ఆయనకు సెల్ ఫోన్లో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎస్సై వంశీకృష్ణ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు మచ్చిక వెంకటేశ్వర్లు, గాయపు రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి మచ్చిక వీరస్వామి, జర్నలిస్టులు సిద్ద నాగరాజు, హరి, నాగరాజు, బలరాం తదితరులు పాల్గొన్నారు.