prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 8:08 am Digital Edition : PRAJA VANI

సంగారెడ్డిలో అక్టోబర్ 7న దళిత జర్నలిస్టు ఫోరం 11వ రాష్ట్ర మహాసభలు

సంగారెడ్డిలో అక్టోబర్ 7న దళిత జర్నలిస్టు ఫోరం 11వ రాష్ట్ర మహాసభలు

 

 

• మహాసభలను విజయవంతం చేయాలి: కాశపోగు జాన్

 

మన సమగ్ర ప్రజావాణి (సంగారెడ్డి ) సెప్టెంబర్ 11

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి

 

 

మహబూబ్‌నగర్: సంగారెడ్డి జిల్లా కేంద్రంలో అక్టోబర్ 7, 2026న నిర్వహించనున్న దళిత జర్నలిస్టు ఫోరం (దళిత జర్నలిస్ట్ ఫోరమ్ ) 11వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో కరపత్రాలను విడుదల చేశారు.

ఈ సందర్భంగా దళిత జర్నలిస్టు ఫోరం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కాశపోగు జాన్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళిత జర్నలిస్టులందరూ ఐక్యంగా ముందుకు వచ్చి మహాసభలకు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

దళిత జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, హక్కులు, వృత్తిపరమైన అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర మహాసభలు కీలక వేదికగా నిలుస్తాయని తెలిపారు. ప్రతి జిల్లా నుంచి దళిత జర్నలిస్టులు తరలివచ్చి తమ ఐక్యతను చాటాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు యాదగిరి, తాటికొండ కృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు జగత్ ప్రకాష్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నాయకులు కొమ్ము దామోదర్ తదితరులు పాల్గొన్నారు.