కడప జిల్లా కడప సెప్టెంబర్ 3 ప్రజావాణి వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో రోజువారీ మెనూ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ గా గురువారం మధ్యాహ్నం కడప నగరంలోని ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో నిర్వహించిన ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు జాల సుమంత్.జిల్లాలోని పలు హాస్టళ్లలో విద్యార్థులకు కనీస మౌలిక వసతులు,పరిశుభ్రమైన తాగునీరు,మరుగుదొడ్లు,విద్యుత్,తదితర సౌకర్యాలు సక్రమంగా అందడం లేదని తెలిపారు. అలాగే హాస్టళ్లలో మెస్ బోర్డులు ఏర్పాటు చేసి,ప్రతిరోజు అందించే మెనూను స్పష్టంగా ప్రదర్శించాలని అన్నారు.విద్యార్థులకు నాణ్యమైన,పౌష్టిక విలువలతో కూడిన ఆహారాన్ని ప్రభుత్వం అందించాలని,ఆహారం నాణ్యతపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని డిమాండ్ చేశారు. హాస్టళ్లలో ఉన్న సమస్యలు అధికారులు పట్టించుకోకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం వెంటనే జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని హాస్టళ్లను తనిఖీ చేసి,విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.విద్యార్థులకు నాణ్యమైన వసతి, పౌష్టికాహారం,మౌలి సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున అందోళన సిద్దమవుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు హరి బాబు కడప నగర అధ్యక్షులు నవీన్ నగర నాయకులు కార్తిక్. తదితరులు పాల్గొన్నారు.